రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో (rape case in Rajendranagar) నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన లైంగికదాడి కేసులో (Rape of 4 year old Girl) పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పరారీలో ఉన్న నిందుతుడిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
Rape of 4 year old Girl : గంజాయి మత్తులో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం - 4 yr old girl was raped in rajendra nagar
09:52 October 21
Rape of 4 year old Girl : చాక్లెట్ ఆశచూపి నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం
ఆలస్యంగా వెలుగులోకి..
ఈ నెల 15న నాలుగేళ్ల చిన్నారి ఇంటి బయట ఆడుకుంటుండగా చాక్లెట్ ఆశ చూపి... కాంతు అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు (Rape of 4 year old Girl). ఈ విషయం తెలియని చిన్నారి తల్లిదండ్రులు కొన్ని రోజుల కిందట తమ స్వగ్రామానికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత బాలిక ఈ ఘాతుకం గురించి తల్లికి చెప్పింది. ఊరు నుంచి తిరిగొచ్చిన వారు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పరారైన నిందితుడు..
ఘటన జరిగి కొన్ని రోజులు గడవడం వల్ల... ఈలోగా నిందితుడు కాంతు పరారయ్యాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు రెండు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.