boy fell on manhole ring : నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటూ మ్యాన్‌హోల్ రింగ్‌పై పడి మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో జరిగింది. స్థానిక సులేమాన్‌నగర్‌లో.. మ్యాన్‌హోల్‌పై వేయాల్సిన రింగ్‌ను జీహెచ్‌ఎంసీ సిబ్బంది రోడ్డుపై పడేశారు. ఈ క్రమంలో నాలుగేళ్ల బాలుడు అబ్దుల్ రహ్మాన్.. ఆడుకుంటూ దానిపై పడ్డాడు.
boy fell on manhole ring : మ్యాన్హోల్రింగ్పై పడి మృతిచెందిన బాలుడు - రాజేంద్రనగర్‌లో నాలుగేళ్ల బాలుడు మృతి
boy fell on manhole ring: హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో ఓ బాలుడు మృతి చెందాడు.
boy fell on manhole ring
గాయపడిన బాలుడు ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. అనుకోని ప్రమాదంలో బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే తమ బిడ్డ మృతిచెందాడని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.
read also: Accident in Srisailm Ghat Road: బస్సులోంచి తల బయటపెట్టింది.. ఊహించని దారుణం జరిగిపోయింది!