ఓ ఇంట్లో పేలిన సిలిండర్.. పక్కింట్లో నలుగురు మృతి - gas Cylinder Blast in mulakaledu
06:41 May 28
ఏపీలో ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి పక్కింట్లో నలుగురు మృతి
Cylinder Blast in anantapur district : అనంతపురం జిల్లా సెట్టూరు మండలం ములకలేడు గ్రామంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి పక్కింటి పైకప్పు కూలి ముస్లిం కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
సిలిండర్ పేలిన ఇంట్లో ఇద్దరికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరు కుటుంబసభ్యులను ఆసుపత్రి తరలించగా... మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తీసుకువెళ్లారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులు దాదు(35), షర్ఫున(30), ఫిర్దోజ్(6), జైనుబి(60)గా పోలీసులు గుర్తించారు.