Jaipur ATM Incident : మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో దొంగతనానికి దుండగులు విఫలయత్నం చేశారు. బుధవారం తెల్లవారుజామున ఏటీఎంలోకి చొరబడ్డ నలుగురు వ్యక్తులు.... గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేశారు.
గ్యాస్ కట్టర్తో ఏటీఎంలోకి చొరబడ్డారు.. కానీ ఏమైదంటే.. - attempt for atm theft
Jaipur ATM Incident : గ్యాస్ కట్టర్తో ఏటీఎంలోని నగదు దోచేయాలని యత్నించారు. ప్లాన్ ప్రకారం నలుగురు వచ్చి ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేశారు. సరిగ్గా అదే సమయానికి పోలీసులు వచ్చారు. ఇది గమనించిన దుండగులు.. ఏం చేశారంటే..?
![గ్యాస్ కట్టర్తో ఏటీఎంలోకి చొరబడ్డారు.. కానీ ఏమైదంటే.. Jaipur ATM Incident, atm theft attempt](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14347425-475-14347425-1643776310587.jpg)
గ్యాస్ కట్టర్తో ఏటీఎంలో చోరీ యత్నం
చోరీ సమాచారం అందుకున్న పోలీసులు... అక్కడికి చేరుకునే లోపు దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఏటీఎంలోని నగదు, గ్యాస్ కట్టర్ అక్కడే వదిలేసి పారిపోయారు. చోరీకి ప్రయత్నం జరిగిన సమయంలో అందులో రూ.22.40 లక్షల నగదు ఉన్నా... ఒక్క రూపాయి కూడా చోరీ కాకపోవడం పట్ల పోలీసుల ఊపిరి పీల్చుకున్నారు. స్థానికంగా రికార్డు అయిన సీసీ ఫుటేజ్‌లోని దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.
గ్యాస్ కట్టర్తో ఏటీఎంలో చోరీ యత్నం
ఇదీ చదవండి:Students Suicide Mystery: ఇద్దరు విద్యార్థినుల బలవన్మరణం.. కారణమేంటి?
Last Updated : Feb 2, 2022, 12:34 PM IST