ACCIDENT: ఆర్మీ జవాను అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం... నలుగురు పోలీసుల దుర్మరణం - రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసులు మృతి
13:56 August 23
ACCIDENT: రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసుల దుర్మరణం
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు పోలీసులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
ఏఆర్ కానిస్టేబుళ్లు బొలెరో వాహనంలో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. భైరిసారంగపురంలో ఓ జవాను మృతదేహాన్ని అప్పగించి ఏఆర్ కానిస్టేబుళ్లు బొలెరో వాహనంలో వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా వీరి వాహనాన్ని లారీ ఢీకొంది. ఘటనలో నలుగురు కానిస్టేబుళ్లు కె.కృష్ణుడు (ఏఆర్ ఎస్సై ), వై. బాబూరావు (హెచ్సీ), పి. ఆంటోనీ (హెచ్సీ), పి. జనార్దనరావు (డ్రైవర్) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో పోలీసుల వాహనం నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఇదీ చదవండి:VOTE FOR NOTE CASE: ఓటుకు నోటు విచారణ ఎల్లుండికి వాయిదా