తెలంగాణ

telangana

ETV Bharat / crime

నీట మునిగి ముగ్గురు చిన్నారులు సహా నలుగురు మృతి - రాజుపాలెంలో చెరువులో పడి నలుగురు మృతి వార్తలు

ఏపీలోని నెల్లూరు జిల్లా రాజుపాలెంలో విషాదం నెలకొంది. నీట మునిగి మొత్తం నలుగురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటనతో రాజుపాలెంలో విషాదచాయలు అలుముకున్నాయి.

four died at nellore
నీట మునిగి ముగ్గురు చిన్నారులు సహా నలుగురు మృతి

By

Published : Jun 7, 2021, 10:07 PM IST

ఏపీలోని నెల్లూరు జిల్లా ఓజిలి మండలం రాజుపాలెంలో తీవ్ర విషాదం నెలకొంది. చెరువు వద్ద ఆడుకునేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు.. ప్రమాదవశాత్తు నీటమునిగి మరణించారు. వారిని కాపాడేందుకు వెళ్లిన మరో వ్యక్తి ఖలీల్ (45) కూడా మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.

చిన్నారులు.. మాచవరం హేమంత్(6), మాచవరం చరణ్ తేజ(8), జాహ్నవి(12) చెరువు వద్దకు ఆడుకునేందుకు వెళ్లి నీటమునిగారు. వీరి తల్లిదండ్రులు రాజుపాలెం హైవేపై దుకాణాలు నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. నలుగురి మృతితో రాజుపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


ఇదీ చదవండి:ఇరువర్గాల మధ్య ఘర్షణ... కానిస్టేబుల్​కు తీవ్ర గాయాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details