Road Accident at Hasnapur: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం హస్నాపూర్ సమీపంలో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మహారాష్ట్రవాసులు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని కిన్వర్ట్ తాలూకా అందుబోరి గ్రామానికి చెందిన సుజిత్ (56), వందన దంపతులు. వీరు తమ పిల్లలు మనీషా (15), సంస్కార్ (11)తో కలిసి ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలోని కిన్వర్ట్ వైపు ద్విచక్రవాహనంపై బయలుదేరారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి - Telangana news
Road Accident at Hasnapur: ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాంసి మండలం హస్నాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోడ్డు ప్రమాదంలో రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
మహరాష్ట్రలోని యవట్‌మల్ తాలుకా మజ్జి గ్రామానికి చెందిన నారాయణ (38) సింకిడి మీదుగా ఆదిలాబాద్ బయలుదేరాడు. ఈ క్రమంలో తాంసి మండలం హస్నాపూర్ వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుజిత్, మనీషా, సంస్కార్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన నారాయణ, వందనను ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నారాయణ మృతిచెందాడు. వందన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలపై ఉన్న ఐదుగురిలో వందన ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: