Sangareddy Road Accident Today: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆందోల్ మండలం కన్సాన్పల్లి శివారులో ఆర్టీసీ బస్సు- కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పొగమంచుతో రోడ్డు కనిపించకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డుప్రమాదంలో నలుగురు దుర్మరణం.. బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు - సంగారెడ్డి జిల్లా యాక్సిడెంట్ న్యూస్
08:19 November 03
Sangareddy Road Accident Today: సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
Private Travel bus Overturned..: మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఏపీలోని పులివెందుల నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దివిటిపల్లి వద్దకు రాగానే అదుపుతప్తి బోల్తా కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 54 మంది ప్రయాణికులుండగా.. సుమారు 40 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన 14 మంది క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి..