బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ వద్ద విషాదం చోటుచేసుకుంది. హార్బర్ నుంచి సముద్ర స్నానానికి వెళ్లి నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. షాజియా సుల్తానా(12) అనే పాప మృతి చెందగా... అస్సద్ ఖాన్(10)అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో తెనాలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అలల తాకిడికి నలుగురు పిల్లలు గల్లంతయ్యారు. మాహే జబిన్(9), షాహిద్(8) అనే మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
సముద్రంలో నలుగురు చిన్నారుల గల్లంతు..! - ఏపీ తాజా వార్తలు
four people drowned in sea: బాపట్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా సముద్రం చూసేందుకు నిజాంపట్నం వచ్చిన నలుగురు చిన్నారులు అలల తాకిడికి కొట్టుకుపోయారు. వీరిలో ఒక పాప మృతదేహం లభ్యమైంది.
తెనాలిలో ఓ పెళ్లి వేడుకకు వచ్చిన సుమారు 40 మంది బంధువులు... విహార యాత్ర కోసం నిజాంపట్నం వచ్చారు. హార్బర్ నుంచి బోటులో ఎక్కి సముద్రం వద్దకు వెళ్లారు. కొద్దీ సమయానికే అలల ఉద్ధృతికి నలుగురు చిన్నారులు సముద్రంలో గల్లంతయ్యారు. యాత్రకు వచ్చిన వారిలో కొందరు తెనాలికి చెందిన వారు కాగా... మరి కొంత మంది హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. సముద్రంలో గల్లంతైన నలుగురు చిన్నారులు తెనాలి మారిస్ పేటకు చెందిన వారని తెలిపారు. చిన్నారుల గల్లంతుతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
ఇవీ చదవండి: