కూలీలపై పడిన పిడుగు, నలుగురు మృతి - thunderstorm

08:15 August 17
బోగోలులో రాత్రి పిడుగుపడి నలుగురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. లింగపాలెం మండలం బోగోలులో పిడుగుపాటుకు నలుగురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా జామాయిల్ కర్రలు తొలగించేందుకు వచ్చిన కూలీలు. పనులు ముగించుకుని గుడారాల్లో సేదతీరుతున్న సమయంలో పిడుగు వీరిని కబళించింది.
గుడారాలపై పిడుగు పడటంతో.. అందులో ఉన్న ఏడుగురిలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా... వీరిని వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. మరణించినవారి మృతదేహాలను శవపరీక్ష కోసం.. ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.