తెలంగాణ

telangana

ETV Bharat / crime

Drug Dealer Tony Case Updates : టోనీ దొరికాడు కానీ.. ఆ నలుగురు ఎక్కడ? - డ్రగ్ డీలర్ టోనీ కేసు

Drug Dealer Tony Case Updates : హైదరాబాద్​లో పలువురికి మాదక ద్రవ్యాలు చేస్తూ పట్టుబడిన నైజీరియన్ టోనీ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు టోనీతో పాటు మరో 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. 9 మందిలో ఏడుగురు వ్యాపారవేత్తలు ఉన్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన వివరాలు ఇంకా సేకరించాల్సి ఉందన్న పీపీ వాదనతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు బెయిల్ నిరాకరించింది.

Drug Dealer Tony Case Updates
Drug Dealer Tony Case Updates

By

Published : Jan 27, 2022, 9:19 AM IST

Drug Dealer Tony Case Updates : రాష్ట్ర రాజధాని నగరంలో డ్రగ్స్‌ వినియోగిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్న హైదరాబాద్‌ పోలీసులు.. డ్రగ్స్‌ స్మగ్లర్‌ టోనీ నుంచి మాదక ద్రవ్యాలను తీసుకున్న నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం టోనీ సహా పది మందిని అరెస్ట్‌ చేసిన పంజాగుట్ట పోలీసులు ఈ కేసులో గజేంద్రపారిఖ్‌, సోమాశశికాంత్‌, అలోక్‌జైన్‌, సంజయ్‌లకు సంబంధం ఉందని ఆధారాలు సేకరించారు. ఈ నలుగురిలో ఒకరు నగరంలోని ప్రముఖ వ్యాపారి కుమారుడని గుర్తించారు. వీరంతా రెండేళ్లుగా టోనీ నుంచి కొకైన్‌ను తీసుకుంటున్నారని సమాచారం. వీరితో పాటు డ్రగ్స్‌ తీసుకుంటున్న నిందితులను కొద్ది రోజుల ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో అప్రమత్తమైన గజేంద్రపారిఖ్‌, అలోక్‌జైన్‌, సంజయ్‌, సోమాశశికాంత్‌లు పారిపోయారు. అప్పటి నుంచి పోలీసులు వీరికోసం వేట కొనసాగిస్తున్నారు. వీరిలో ఇద్దరు నిందితులు బంజారాహిల్స్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌లోని కొన్ని పంచతార హోటళ్లు, పబ్బుల్లో పార్టీలు నిర్వహించి అందులో కొకైన్‌ను సరఫరా చేసేవారని పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు.

వినియోగమా? సరఫరానా??

Drug Dealer Tony Case News : మాదక ద్రవ్యాలను తరచూ తీసుకుంటున్న నిరంజన్‌ కుమార్‌ జైన్‌, అలోక్‌జైన్‌, అగర్వాల్‌, గజేంద్ర పారిఖ్‌లు తమ సొంతానికి డ్రగ్స్‌ వాడుతున్నారా? లేక టోనీ నుంచి కొకైన్‌ను కొనుగోలు చేసి హైదరాబాద్‌లో ఇంకా ఎవరికైనా విక్రయిస్తున్నారా?కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. డ్రగ్స్‌ అవసరమైనప్పుడు నిరంజన్‌, అగర్వాల్‌లు తమ డ్రైవర్లను ముంబయికి పంపించి టోనీ నుంచి కొకైన్‌ను తెప్పించేవారని, సొంత వినియోగానికైతే ఇంత కొకైన్‌ అవసరం లేదని పోలీసులు అంచనా వేస్తున్నారు. రూ.వందల కోట్ల టర్నోవర్‌ ఉన్న వ్యాపారాలను నిర్వహిస్తున్న వీరంతా డ్రగ్స్‌కు ఎలా అలవాటు పడ్డారన్న కోణాన్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు పరారీలో ఉన్న నిందితుల్లో ఒకరు రహస్యంగా క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాడని, ముంబయి, దిల్లీల్లోని బుకీలతో సంబంధాలు ఉన్నాయని తెలుసుకున్నారు. డ్రగ్స్‌ వ్యవహారంలో మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో పోలీస్‌ కస్టడీకి పిటిషన్‌ వేయగా.. నిందితులు బెయిల్‌ కోసం కోర్టును అభ్యర్థించారు. ఈ రెండు అంశాలపై గురువారం నిర్ణయం వెలువడనుందని పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి : Ganja Seized : రూ.2 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details