ఆన్లైన్ లోన్ యాప్ కేసులో మరో నలుగురు అరెస్టు - loan apps case updates
13:03 February 03
ఆన్లైన్ రుణాల కేసులో మరో ముఠా అరెస్టు
యాప్ల ద్వారా రుణాలు ఇస్తామని మోసం చేస్తున్న మరో ముఠాను దక్షిణ మండల పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ పాతబస్తీలో ఆన్లైన్ రుణాల పేరుతో పలువురిని మోసగించిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా.. ప్రజలు ఇలాంటి వారి చేతిలో మోసపోతూనే ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమాయకుల అవసరాన్ని ఆసరా చేసుకుని కొందరు కేటుగాళ్లు ఆన్లైన్ యాప్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.