నిమజ్జనానికి వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా.. నలుగురి దుర్మరణం - ఖమ్మంలో ట్రాక్టర్ బోల్తా
01:08 October 17
ట్రాక్టర్ బోల్తా... నలుగురు మృతి
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అయ్యగారిపల్లి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడటంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో పలువురు గాయాలపాలయ్యారు. దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది.
కమలాపురం నుంచి అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు మున్నేరు నదికి తరలించారు. ఒక ట్రాక్టర్‌లో విగ్రహం ఉండగా.. మరో ట్రాక్టర్‌లో కొంతమంది గ్రామస్థులు, యువకులు ఎక్కారు. విగ్రహం ఉన్న ట్రాక్టర్ మున్నేరు నది వద్దకు వెళ్లింది. వెనుకనున్న మరో ట్రాక్టర్ వల్లభి వైపు వెళ్లింది. ట్రాక్టర్ వేగానికి తోడు వర్షం కురుస్తుండటంతో అయ్యగారిపల్లి వద్ద బోల్తాపడింది. ప్రమాదంలో స్వామి(35), ఎన్.ఉమ(35), ఉపేందర్(32), నాగరాజు(25) ఘటనాస్థలిలోనే మృతి చెందారు. మరి కొందరు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏసీపీ బసవ రెడ్,డి రామోజీ రమేశ్, డీసీపీ చంద్రబోస్, సీఐ సత్యనారాయణ రెడ్డి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:Fire accident: ఇనుప సామగ్రి దుకాణంలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు