మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) చోటు చేసుకుంది. సిమెంటు కాంక్రీట్ టిప్పర్ వాహనం... రెండు ద్విచక్ర వాహనాలతో పాటు మరో ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
Accident: మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం, నలుగురు మృతి - Telangana enws
21:13 June 18
గంగాపూర్ వద్ద కాంక్రీట్ మిక్సర్ లారీ బీభత్సం
167వ నెంబర్ జాతీయ రహదారిపై గంగాపూర్ పత్తి మార్కెట్ యార్డ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. జడ్చర్ల వైపు నుంచి గంగాపూర్ వెళుతున్న కాంక్రీట్ టిప్పర్ వాహనం... రెండు ద్విచక్ర వాహనాలను, ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ద్విచక్ర వాహనాలపై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
మరో వ్యక్తి ట్రాక్టర్‌పై నుంచి కింద పడి మృతి చెందినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి:Ts Lockdown: రాష్ట్రంలో లాక్డౌన్ ఇక ఉండదా? అయితే వాట్ నెక్స్ట్