తెలంగాణ

telangana

ETV Bharat / crime

పెనుకొండ: విషాదయాత్రగా విహారయాత్ర - Ananatapur Latest News

విహారయాత్ర విషాదయాత్రగా మారిన ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా పెనుకొండలో జరిగింది. చెరువులో మునిగి నలుగురు మృతి చెందారు.

పెనుకొండ: విషాదయాత్రగా విహారయాత్ర
పెనుకొండ: విషాదయాత్రగా విహారయాత్ర

By

Published : Mar 14, 2021, 8:23 PM IST

ఏపీలోని అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలోని భోగసముద్రం చెరువు, బాబయ్య దర్గా సందర్శించడానికి.. విహారయాత్రకు అనంతపురంలోని సూర్యనగర్ వాసులు ఆదివారం సాయంత్రం వచ్చారు. చెరువు సందర్శనలో భాగంగా నీటిలో దిగారు. ప్రమాదవశాత్తు నలుగురు గల్లంతయ్యారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని నాలుగు మృతదేహాలు బయటికి తీశారు.

మరో ఇద్దరిని ప్రాణాలతో కాపాడారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెనుగొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పెనుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మృతులు:

అల్లాబక్షి (42)-గోల్డ్ స్మిత్

షేక్షావలి(17)-9వ తరగతి

తస్లీమ్(14)-6వ తరగతి

సాదిక్(40)-ఐరన్ షాప్ నిర్వాహకుడు

ఇదీ చదవండి: రేపట్నుంచి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు

ABOUT THE AUTHOR

...view details