ఏపీలోని కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం డి.అగ్రహారం వద్ద 67వ నెంబరు జాతీయ రహదారిపై.. లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. అనంతపురం నుంచి విజయవాడకు టమోటాలతో వెళ్తున్న లారీ.. బద్వేలు సమీపంలోని డి.అగ్రహారం వద్ద.. ఎదురుగా వస్తున్న కర్నాటక కారు ఢీకొన్నాయి.
accident: జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. నలుగురు మృతి - ap news
ఏపీలోని కడప జిల్లాలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. అనంతపురం నుంచి విజయవాడకు కూరగాయల లోడుతో వెళ్తున్న లారీ... కర్ణాటక నుంచి వస్తున్న కారు ఢీకొన్నాయి. క్షతగాత్రులను కడప సర్వజన ఆస్పత్రికి తరలించారు.
accident
ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. లారీ బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ బద్వేలులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. గాయపడిన ముగ్గురినీ మెరుగైన చికిత్స కోసం కడప సర్వజన ఆస్పత్రికి తరలించారు.