తెలంగాణ

telangana

ETV Bharat / crime

Road Accident: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి - పెంచికలపాడు వద్ద మినీ లారీ, వ్యాన్ ఢీ

Road Accident: ఏపీ ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Road
Road

By

Published : Feb 8, 2022, 7:48 PM IST

Road Accident: ఏపీ ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బేస్తవారిపేట మండలం పెంచికలపాడు సమీపంలో అనంతపురం-అమరావతి జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్, మినీ లారీ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

కర్నూలు జిల్లా నుంచి మిర్చి లోడుతో వెళ్తున్న డీసీఎం లారీ... ఆవులు, కోడె దూడలతో వస్తున్న మినీ వ్యాన్‌ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాల్లోని నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. 8 కోడె దూడలు అక్కడిక్కక్కడే ప్రాణం విడిచాయి. మరో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలు, జంతువుల కళేబరాలతో రోడ్డు రక్తసిక్తమైంది.

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి

ఇదీ చూడండి:విభజన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయి: మోదీ

ABOUT THE AUTHOR

...view details