Road Accident: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురులంక-యానాం గౌతమి వంతెనపై... ఐదుగురు కుటుంబ సభ్యులతో వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యా భర్తలతో పాటు కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా... ఆసుపత్రిలో మరో చిన్నారి మృతి చెందింది. లక్కీ అనే చిన్నారికి తీవ్రగాయాలు కావడంతో కాకినాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Road Accident: ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన వ్యాన్.. నలుగురు మృతి
Road Accident: ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా ఎదురులంక- యానాం గౌతమి వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని వ్యాన్ ఢీకొట్టడంతో దంపతులతో సహా కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆసుపత్రిలో మరో చిన్నారి మృతి చెందింది.
Road Accident: ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన వ్యాన్... నలుగురు మృతి
మృతులు ఐ.పోలవరం మండలం జి.వేమవరం గ్రామానికి చెందిన వైదాడి కుమార్ (35), వైదాడి పద్మ(30), హర్ష(10), హర్షితగా పోలీసులు గుర్తించారు. కాకినాడ నుంచి అమలాపురం వెళ్తున్న మినీ వ్యాన్... ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత ఎక్కువైందని పోలీసులు తెలిపారు. వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.