తెలంగాణ

telangana

ETV Bharat / crime

four died: విహారయాత్రకు వెళ్లి.. అనంతలోకాలకు చేరి - Four died fall into water in ap

ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్టు వద్ద ఉన్న గండిమడుగులో ఓ వ్యక్తి సహా ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. నీటి మడుగు వద్ద సరదాగా ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మడుగులో పడిపోయారు. గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు స్థానికులతో కలిసి గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు.

four dead: విహారయాత్రకు వెళ్లి.. అనంతలోకాలకు చేరి
four dead: విహారయాత్రకు వెళ్లి.. అనంతలోకాలకు చేరి

By

Published : Aug 7, 2021, 10:41 PM IST

ఏపీలోని కడప జిల్లా గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్టు సమీపంలోని గండి మడుగులో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారంతా బెంగళూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. విహారయాత్ర కోసం బయలుదేరిన 10 మంది బృందం.. బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి మరో 10 మందితో కలిసి మొత్తం 20 మంది వెలిగల్లు ప్రాజెక్టు వద్దకు వచ్చారు. అక్కడ ఆడుకుంటూ దిగువనున్న గండి మడుగులోకి సరదాగా ఈతకు వెళ్లారు. వారిలో నలుగురు గల్లంతయ్యారు.

బెంగళూరుకు చెందిన తాజ్‌ మహ్మద్‌(40), మహ్మద్‌ హంజా(12), ఉస్మాన్‌ ఖానమ్‌(11), మహ్మద్‌ హఫీజ్‌(10)లు గల్లంతైన వారిలో ఉన్నారు. లక్కిరెడ్డిపల్లి సీఐ యుగంధర్‌ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి బంధువుల రోదనలతో ఘటనా స్థలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చూడండి: Ganja Seized: భాగ్యనగరంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details