ఏపీలోని విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వి.మాడుగుల మండలం జాలంపిల్లి వద్ద పెద్దేరు వాగులో పడి నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. బట్టలు ఉతికేందుకు పెద్దలతోపాటు వెళ్లి ప్రమాదవశాత్తు పెద్ద రేవు ఊబిలో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టగా..అప్పటికే చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
విషాదం: బట్టలు ఉతికేందుకు పెద్దలతో వెళ్లి.. - తెలంగాణ వార్తలు
ఏపీలోని విశాఖ జిల్లా పెద్దేరులో విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఉతికేందుకు పెద్దలతో పాటు పెద్దేరులో దిగిన నలుగురు పిల్లలు మృతి చెందారు.
నలుగురు చిన్నారులు గల్లంతు, ఏపీలో నలుగురు పిల్లలు మిస్సింగ్
మృతి చెందిన వారిలో నీలాపు మహేందర్ (7), వంత్తాల వెంకట ఝాన్సీ (10), వంత్తాల షర్మిల (7) వంత్తాల జాహ్నవి (11) ఉన్నారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: