Tragedy : బావిలో ఈతకు దిగి నలుగురు చిన్నారులు మృతి - four kids died in kurnool district AP
20:24 May 19
విషాదం : బావిలో ఈతకు దిగి నలుగురు చిన్నారులు మృతి
సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృతి చెందిన ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం ఆలంకొండలో చోటుచేసుకుంది. సాయికుమార్, కార్తీక్, రాజేశ్, కమాల్ బాషా ఆలంకొండకు చెందిన స్నేహితులు. ఇవాళ సాయంత్రం పూట సరదాగా నలుగురు కలిసి ఓ పొలం వద్దకు ఈతకు వెళ్లారు.
అక్కడ వ్యవసాయ బావిలో ఈత కొట్టడానికి దిగారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న విద్యుత్ మోటార్ వైర్లు తగిలి ప్రాణాలు కోల్పోయారు. నలుగురు చిన్నారుల మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.