తెలంగాణ

telangana

ETV Bharat / crime

బ్లాక్​ ఫంగస్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్ - రాచకొండ ఎస్వోటీ పోలీసులు

బ్లాక్​ ఫంగస్ చికిత్స కోసం వాడే యాంఫైట్ ఇంజక్షన్లను బ్లాక్​లో విక్రయిస్తున్న నలుగురిని రాచకొండ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక జూనియర్ డాక్టర్, స్టాఫ్ నర్స్​ కూడా ఉన్నట్లు గుర్తించారు.

four-arrested-for-selling-black-fungus-injections-in-hyderabad
యాంఫైట్​ ఇంజక్షన్లు విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్

By

Published : May 22, 2021, 8:49 AM IST

సరూర్​నగర్​, ఎల్బీనగర్​ ఠాణాల పరిధిలో బ్లాక్​ ఫంగస్ చికిత్సలో వాడే ఇంజక్షన్లను బ్లాక్​లో విక్రయిస్తున్న నలుగురు నిందితులను రాచకొండ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవసరం ఉన్న వారికి వీటిని 50 వేల వరకూ విక్రయిస్తున్న గుర్తించారు. పక్కా సమాచారంతో ఇంజక్షన్లు కావాలని డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి.. వీరిని అరెస్ట్ చేశారు.

నిందితులు శ్రవణ్ కుమార్, శైలేంద్ర కుమార్, రమావత్ రామాంజనేయులు, గండే స్నేహిత్​లుగా గుర్తించారు. వీరిలో ఒక జూనియర్ డాక్టర్, స్టాఫ్​నర్స్ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి నాలుగు ఇంజక్షన్లు, 5 చరవాణులు స్వాధీనం చేసుకుని... ఆయా పరిధిలోని పోలీసులకు అప్పగించారు.

ఇదీ చూడండి:కొవిడ్‌ పంజా: ప్రాణాలు కోల్పోతున్న యువ ఉద్యోగులు

ABOUT THE AUTHOR

...view details