తెలంగాణ

telangana

ETV Bharat / crime

'లవ్​ టుడే'లోని ఆ సీన్​ రిపీట్​... నలుగురి అరెస్ట్ - HYD latst news

Four arrested for harassing female students of engineering college: ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులను వేధిస్తున్న నలుగురు అరెస్టు అయ్యారు. సామాజిక మాధ్యమాల్లో కొన్ని గ్రూప్స్ ఏర్పాటు చేసి వేధిస్తున్నారని రాచకొండ సీపీ చౌహన్ వెల్లడించారు. ఒక్క అమ్మాయితో పరిచయం ఏర్పరుచుకుని బ్లాక్‌మెయిల్‌ చేస్తారని తెలిపారు.

Four arrested for harassing female students of engineering college
ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులను వేధిస్తున్న నలుగురు అరెస్టు

By

Published : Jan 7, 2023, 8:08 PM IST

ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులను వేధిస్తున్న నలుగురు అరెస్టు

Four arrested for harassing female students of engineering college: హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థినులను వేధిస్తున్న నలుగురు నిందుతుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఒక అమ్మాయితో పరిచయం ఏర్పరుచుని ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేసి... ఆమె ద్వారా ఇతర అమ్మాయిలు నంబర్లు తీసుకుంటున్నారని రాచకొండ సీపీ చౌహన్‌ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో గ్రూప్స్‌ ఏర్పాటు చేసి వారిని వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఘటన ఇటీవల వచ్చిన ఓ చిత్రంలోని సన్నివేశాలను తలపిస్తున్నాయి.

సైబర్‌ నేరాలపై ఆ కళాశాలలో అవగాహన కల్పించామని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. అమ్మాయిలను సామాజిక మాధ్యమాల్లో వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రతి కళాశాలలో సైబర్‌ నేరాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.

అమ్మాయిలను వేధిస్తున్నారని తెలుసుకొని మేము లోతుగా పరిశీలించాం. మొబైల్​ డాటా ద్వారా కనిపెట్టాం. ముందు ఒక అమ్మాయితో పరిచయం ఏర్పరచుకొని తరువాత తన స్నేహితులను వేధిస్తున్నారు. ఈ కారణంగా వారిని అరెస్టు చేశాము. ప్రతి కళాశాల్లో సైబర్​ నేరాలపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపడతాము. -చౌహన్‌, రాచకొండ సీపీ

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details