హైదరాబాద్ మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నలుగురు యువకులు కలిసి ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆటోలో ఎక్కించుకుని వెళ్లి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది. గురువారం జిల్లెలగూడలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు.
Gang Rape in Hyderabad: ఆటోలో ఎక్కించుకుని.. ఆపై ముగ్గురితో కలిసి దారుణం - నగరంలో పట్టపగలే దారుణం
రాజధాని నగరంలో పట్టపగలే దారుణం జరిగింది. నలుగురు కామాంధులు మహిళపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా బయటకొచ్చింది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు
గురువారం వ్యక్తిగత పనుల కోసం జూబ్లీహిల్స్ నుంచి కోఠికి వచ్చిన మహిళ ఆటో కోసం నిలబడింది. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ అఖిల్ జూబ్లీహిల్స్ వెళుతున్నానని చెప్పి ఆ మహిళను ఆటోలో ఎక్కించుకున్నారు. అతను మార్గమధ్యలోనే ముగ్గురు స్నేహితులకు ఫోన్ చేశాడు. జిల్లెలగూడలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నలుగురు యువకులు మహిళపై అత్యాచారం చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు....ఆటోడ్రైవర్ అఖిల్‌తోపాటు నితిన్, ప్రశాంత్, శ్రీనులను అరెస్టు చేశారు.
ఇదీ చూడండి: