BRUTAL MURDER: కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. దోమకొండ మండలం మాజీ జెడ్పీటీసీ మన్నే నర్సింలు(50) దారుణ హత్యకు గురయ్యారు. కామారెడ్డిలో ఉండే మాజీ జెడ్పీటీసీ ఆదివారం గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన శ్రీనివాస్ రెడ్డి మామిడి తోటలోకి వెళ్లారు. తోటలో మిత్రులతో కలిసి ఉండగా.. సందీప్ రెడ్డి అనే యువకుడు మన్నె నర్సింలుపై గొడ్డలితో దాడి చేశాడు. బాధితుడిని వెంటనే హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో దారుణం.. మాజీ జడ్పీటీసీ దారుణ హత్య
MURDER: కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మాజీ జెడ్పీటీసీ మన్నే నర్సింలుపై ఆదివారం ఓ వ్యక్తి గొడ్డలితో కిరాతకంగా దాడి చేశాడు. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
జడ్పీటీసీ