తెలంగాణ

telangana

ETV Bharat / crime

Red sandalwood smuggler: తప్పించుకోబోయి తనువు చాలించాడు ! - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

అటవీ అధికారుల నుంచి తప్పించుకోబోయి తనువు చాలించాడు ఓ ఎర్రచందనం(red sandalwood smuggling in ap) కూలి. కడప జిల్లాలోని అటవీ ప్రాంతంలో అధికారులు కూంబింగ్‌ నిర్వహించారు. సుమారు 50 మంది ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. అధికారుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ వ్యక్తి వాహనంపై నుంచి దూకి మృతి చెందాడు.

Red sandalwood smuggler, Red sandalwood smuggling in andhra pradesh
ఎర్రచందనం కూలి తప్పించుకోబోయి తనువు చాలించాడు

By

Published : Nov 26, 2021, 1:58 PM IST

Red sandalwood smuggling in andhra pradesh: ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని అటవీ ప్రాంతంలో అధికారుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ ఎర్రచందనం కూలీ వాహనంపై నుంచి దూకి మృతి చెందాడు. ఖాజీపేట మండలం నాగసాయిపల్లె వద్ద ఎర్రచందనం తరలిస్తున్నట్లు సమాచారం అందటంతో... అటవీ అధికారులు కూంబింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో సుమారు 50 మంది ఎర్రచందనం కూలీలు ఖాజీపేట నుంచి ప్రొద్దుటూరు వైపు లారీలో పారిపోతూ అధికారులకు తారసపడ్డారు. మైదుకూరు పట్టణ శివారులోని ఫ్లైఓవర్ వద్ద వారిని అదుపులోకి తీసుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నించారు.

అధికారుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ ఎర్రచందనం(red sandalwood news) కూలీ వాహనంపై నుంచి దూకి మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలు కాగా కడప రిమ్స్​కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నలుగురు తమిళ కూలీలను ప్రొద్దుటూరు అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఫారెస్ట్ అధికారులపై కూలీలు చేసిన దాడిలో.. ఖాజీపేట సెక్షన్ ఆఫీసర్ గాయపడినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి :Car Fire in Rajendra nagar: ఇంజిన్​లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. కారు దగ్ధం

ABOUT THE AUTHOR

...view details