నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవుల్లో మంటలు చెలరేగాయి. హైదరాబాద్- శ్రీశైలం ప్రధాన రహదారికి ఆనుకుని అక్టోపస్ వ్యూ పాయింట్ కలదు. అక్కడి నుంచి నీలారం బండల వరకూ సుమారు రెండు కిలోమీటర్ల మేర అడవుల్లో మంటలు ఎగసి పడ్డాయి. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఒకసారి మంటలు రాగా అటవీశాఖ సిబ్బంది ఆర్పివేశారు.
నల్లమల అడవుల్లో పెద్దఎత్తున మంటలు - telangana news today
నల్లమల అడవీ ప్రాంతంలో కార్చిచ్చు రేగింది. హైదరాబాద్- శ్రీశైలం పరిధిలోని నీలారం సమీపంలో సుమారు రెండు కిలోమీటర్ల మేర అడవుల్లో మంటలు ఎగసి పడ్డాయి. దీంతో అటవీ ప్రాంతంలో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. నిప్పుతో కూడిన మంటలు చెలరేగుతూ దట్టమైన పొగ వ్యాపించింది.
నల్లమల అడవుల్లో పెద్దఎత్తున మంటలు
మళ్లీ రాత్రి 10 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అటవీశాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని... మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. శరవేగంగా మంటలు వ్యాపిస్తుండటంతో వాటిని అదుపులోకి తెచ్చేందుకు.. సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. వేసవి కాలంలో నల్లమలలో మంటలు చెలరేగడం సహజమే. కానీ ఎక్కువ విస్తీర్ణంలో వచ్చినప్పుడే ఆర్పడం కష్టంగా మారుతోంది.
ఇదీ చూడండి :చున్నీతో భర్తను చంపిన భార్య