హైదరాబాద్‌లో పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా.. మాదక ద్రవ్యాల దందా ఆగడం లేదు. నగరంలో కొకైన్‌ను విక్రయిస్తున్న విదేశీయుడిని నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. రిపబ్లిక్ ఆఫ్ ఘనా దేశానికి చెందిన జోసెఫ్ టాగోయ్ (28) గత కొంత కాలంగా నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజమెల్ల ప్రాంతంలో నివసిస్తున్నాడు.
COCAINE: కొకైన్ విక్రయిస్తున్న విదేశీయుడు అరెస్ట్ - telangana varthalu
భాగ్యనగరంలో మరోసారి కొకైన్ కలకలం సృష్టించింది. ప్రభుత్వం ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ నగరంలో డ్రగ్స్, కొకైన్ వాడకం ఎక్కువవుతోంది. కొకైన్‌ను విక్రయిస్తున్న విదేశీయుడిని నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు.
కొకైన్ విక్రయిస్తున్న విదేశీయుడు అరెస్ట్
గత కొంత కాలంగా నగరంలో పలువురు కస్టమర్లకు కొకైన్ సరఫరా చేసున్నాడు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు రాజమెల్లలోని అతని ఇంటిలో తనిఖీలు చేయగా 30 గ్రాముల కొకైన్ లభ్యమైంది. జోసెఫ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు... అతని వద్ద నుంచి 30,500రూపాయల నగదు సీజ్ చేసి రిమాండ్‌కు తరలించారు. నగరంలో ఇంకెవరైనా మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నారా అని పోలీసులు విచారించారు.
ఇదీ చదవండి:Rash Driving: మద్యం మత్తులో డ్రైవర్ రాష్ డ్రైవింగ్.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే..