తెలంగాణ

telangana

ETV Bharat / crime

Foreign Currency Seized: శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత - ఎయిర్​పోర్ట్​లో విదేశీ కరెన్సీ

Foreign Currency Seized in Shamshabad: శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళ్లేందుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.17.75 లక్షలు విలువచేసే విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.

Foreign Currency Seized
శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత

By

Published : Dec 2, 2021, 5:35 PM IST

Foreign Currency Seized: శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. దుబాయ్ వెళ్లేందుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల లగేజీని తనిఖీ చేయగా సౌదీ, యూఏఈకు చెందిన కరెన్సీ దొరికింది. వాటి విలువ రూ.17.75 లక్షలు ఉంటుందని విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

UAE currency seized in airport: వారి వద్ద నుంచి 89,500 సౌదీ అరేబియన్‌ రియాల్స్‌, 2,900 యుఏఈ దిర్హమ్‌లు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్‌ చేసేందుకు విదేశీ కరెన్సీ తెచ్చినట్లుగా గుర్తించారు. ఇద్దరు ప్రయాణీకులను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

Gold seize in shamshabad: ఎవరికి దొరకకుండా బంగారాన్ని పేస్ట్​లాగా చేసి సీటు కింద పెట్టుకొని

ABOUT THE AUTHOR

...view details