తెలంగాణ

telangana

ETV Bharat / crime

రూ.20లక్షలు విలువ చేసే విదేశీ సిగరెట్లు పట్టివేత - తెలంగాణ వార్తలు

మంగళహాట్​ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.20 లక్షలు విలువ చేసే విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. దిల్లీలో కొనుగోలు చేసి హైదరాబాద్​లో విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు.

foreign cigarettes seized, north task force police
విదేశీ సిగరేట్ల పట్టివేత, నార్త్ జోన్ పోలీసులు

By

Published : Jun 16, 2021, 11:28 AM IST

హైదరాబాద్​లోని మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మొత్తంలో విదేశీ సిగరెట్లను టాస్క్​ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆగాపురా సీతారాంపేట్​లో ఉన్న ఓ గోదాములో అక్రమంగా విదేశr సిగరెట్లు నిల్వ ఉంచారనే సమాచారంతో మంగళవారం తనిఖీలు చేపట్టినట్లు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. ఆకాష్ కుమార మాలి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న సిగరెట్ల విలువ సుమారు రూ.20 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.

తక్కువ సమయంలోనే డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఆకాష్ మాలి, వికాస్ మాలి అనే ఇద్దరు వ్యక్తులు దిల్లీ నుంచి విదేశీ సిగరెట్లు కొనుగోలు చేసి హైదరాబాద్​ హోల్​సేల్​ దుకాణాల్లో విక్రయించేవారని పోలీసులు తెలిపారు. నియమాల ప్రకారం సిగరెట్ ప్యాకెట్ పైన జర్దా హానికరమని చిత్రించాలి కానీ అది లేదని పోలీసులు తెలిపారు. వికాస్ మాలి అనే నిందితుడు పరారయ్యాడని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'వైరస్‌ సోకినా... వ్యాక్సిన్‌తో ప్రాణాపాయం తప్పుతుంది'

ABOUT THE AUTHOR

...view details