పంజాగుట్ట ప్రధాన రహదారిపై ఫోర్డ్ కారును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లిపోయారు. ఉదయం మూడు గంటలకు పంజాగుట్ట సెంట్రల్ ఎగ్జిట్ వద్ద కారు నిలిపిన వాహనచోదకుడు.. అప్పటి నుంచి కారును తీసుకెళ్లేందుకు రాలేదు.
నడిరోడ్డుపై ఫోర్డ్ కారు... వదిలారా? వదిలించుకున్నారా? - ఫోర్డ్ కారు పార్కింగ్ వార్తలు
తెల్లవారు జామున మూడు గంటలకు ఫోర్డ్ కారు పార్క్ చేసిన వ్యక్తి మధ్యాహ్నమైన తీసుకెళ్లేందుకు రాకపోవడంతో... పోలీసులు వాహనాన్ని స్టేషన్కు తరలించారు. ఈ ఘటన పంజాగుట్ట పరిధిలో చోటు చేసుకుంది.

నడిరోడ్డుపై ఫోర్డ్ కారు... వదిలారా? వదిలించుకున్నారా?
దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు... పోలీసులను రప్పించి ప్రాథమిక విచారణ చేపట్టారు. అనంతరం వాహనాన్ని స్టేషన్కు తరలించారు. ఏదైనా ప్రమాదం చేసి ఇక్కడ వదిలి వెళ్లారా? లేక పార్కింగ్ చేసిన వ్యక్తికి ఏమైనా జరిగిందా అనే కోణంలో విచారణ ప్రారంభించారు.
ఇదీ చూడండి:వేధింపులు తాళలేక.. స్టేషన్ ఎదుటే ఆటోను తగలబెట్టేశాడు!
Last Updated : Jan 22, 2021, 9:23 PM IST