ఓ హోటల్(hyderabad hotel news) నిర్వాహకుడు రోజుల తరబడి నిల్వ ఉంచిన, పురుగులు, బూజుపట్టిన మాంసం వండి పెడుతూ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా బండ్లగూడజాగీర్ నగరపాలక సంస్థ పరిధిలో వెలుగు చూసింది. బండ్లగూడజాగీర్ కూడలిలోని పెట్రోలు బంకు పక్కన ‘జస్ట్ డ్రైవ్ ఇన్ ఫుడ్‌కోర్టు’ రెస్టారెంట్(hyderabad hotel news) ఉంది. మంగళవారం నగరపాలక సంస్థ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ గౌరిశెట్టి మనోహర్, స్థానిక తెరాస నాయకుడు మద్దెల ప్రేంగౌడ్, మరికొంతమంది స్థానికులు రెస్టారెంట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫ్రిజ్‌లో బూజుపట్టిన మాంసం, పురుగులు పట్టిన చికెన్ దర్శనమిచ్చాయి.
Hyderabad Hotel news: ఓ హోటల్ నిర్వాకం.. మటన్‌లో బూజు.. చికెన్‌లో పురుగులు! - తెలంగాణ వార్తలు
రోజుల తరబడి ఫ్రిజ్‌లో నిల్వ ఉన్న పదార్థాలు. బూజు పట్టిన మాంసం.. పురుగులతో దర్శనం ఇచ్చిన చికెన్.. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీల్లో బయటపడిన నిజాలు. ఇదంతా బండ్లగూడజాగీర్ కూడలిలోని ఓ హోటల్(hyderabad hotel news) నిర్వాకం..! ఈ పదార్థాలను తింటే ఇక అంతే సంగతులు.
హైదరాబాద్ హోటల్, హోటల్లో అధికారుల తనిఖీలు
రెండు రోజుల కిందటి బిర్యానీని తిరిగి వేడి చేసి పెడుతున్నట్లు గుర్తించారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ గౌరిశెట్టి మనోహర్ వాటిని నాణ్యత పరిశీలన కోసం సేకరించారు. హోటల్ నిర్వాహకుడిపై అక్కడికక్కడే రూ.5వేల జరిమానా విధించారు.
ఇదీ చదవండి:గొంతులో ఇరుక్కుపోయిన మాంసం ముక్క.. తరువాత ఏమైందంటే..