మద్యం మత్తులో ఐదుగురు యువకులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ బార్లో వీరంగం సృష్టించారు. మద్యం డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు బార్ మేనేజర్‌పై దాడి చేశారు. అడ్డుకోబోయిన సిబ్బందినీ కొట్టారు.
బార్ ఎదుట యువకుల వీరంగం.. యజమానిపై దాడి - five young men attacked on bar manager
ఆదివారం సెలవు రోజు కావడంతో అలా సరదాగా ఐదుగురు యువకులు బయటకు వచ్చారు. దగ్గర్లోని బార్‌కు వెళ్లి పూటుగా మద్యం సేవించారు. ఇంకేముంది అప్పటిదాకా వారి మధ్య వెల్లువెత్తిన స్నేహబంధాన్ని మద్యం డామినేట్ చేసింది. కారణం లేకుండా వారిలో వారే ఘర్షణ పడ్డారు. వీరి ఆగ్రహానికి ఆ బార్ యజమాని బలయ్యాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..
![బార్ ఎదుట యువకుల వీరంగం.. యజమానిపై దాడి young men attacked on bar manager](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12721545-665-12721545-1628512541260.jpg)
కామారెడ్డి కొత్త బస్టాండ్ సమీపంలోని ఓ బార్‌కు రాత్రి ఐదుగురు యువకులు వెళ్లారు. పూటుగా మద్యం సేవించిన అనంతరం వారిలో వారు గొడవ పెట్టుకొని ఘర్షణకు దిగారు. గొడవ ఆపేందుకు బార్ సిబ్బంది వెళ్లగా వారిపై కూడా దాడి చేశారు. మద్యం బిల్లు కట్టమని అడగడంతో మరోసారి దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో బార్ మేనేజర్ రాజేశ్వర్రావు తలకు తీవ్ర గాయమైంది. ఈ మేరకు పట్టణ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:Kishor: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ భయంతోనే వీఆర్‌ఎస్ తీసుకున్నారు