Child Missed OR Kidnap In Nellore: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో అయిదేళ్ల చిన్నారి అదృశ్యమైంది. నగరంలోని కుక్కలగుంట మహాలక్ష్మి అమ్మవారి ఆలయ సమీపంలో తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న చిన్నారి కనిపించకుండా పోయింది. చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదా పాపే నిద్రలో లేచి ఏటైనా వెళ్లిపోయిందా అన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఐదేళ్ల చిన్నారి అదృశ్యం.. ఎక్కడో తెలుసా? - నెల్లూరు కిడ్నాప్ వార్తలు
Child Missed OR Kidnap In Nellore: ఏపీలోని నెల్లూరులో అయిదేళ్ల చిన్నారి అదృశ్యమైంది. చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగించే భార్యాభర్తలు రాత్రి తమ ముగ్గురు పిల్లలతో కలిసి కుక్కలగుంట ప్రాంతంలో నిద్రించారు. చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదా పాపే నిద్రలో లేచి ఏటైనా వెళ్లిపోయిందా అన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగించే భార్యాభర్తలు రాత్రి తమ ముగ్గురు పిల్లలతో కలిసి కుక్కలగుంట ప్రాంతంలోని నిద్రించారు. తెల్లవారుజామున తల్లి పాపమ్మ లేచి చూసుకునేసరికి అయిదేళ్ల పాప కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. అయినా పాప ఆచూకీ లభించకపోవడంతో చిన్నబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇటీవల సంతపేట సమీపంలోనూ ఓ చిన్నారి అదృశ్యమవగా.. పోలీసులు ఆ కేసును ఛేదించారు. మరోసారి ఇలాంటి సంఘటనే జరగడంతో స్థానికులు కలవరపడుతున్నారు.
ఇవీ చదవండి