సిలిండర్ పేలి చిన్నారి మృతి.. మరో నలుగురికి గాయాలు - Five-year-old child dies after gas cylinder explodes at home

12:50 March 22
సిలిండర్ పేలి చిన్నారి మృతి
Child died in cylinder explode: నిజామాబాద్ లోని ఓ ఇంట్లో సిలిండర్ పేలి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నగర శివారులోని ఓ ఇంట్లో సిలిండర్ పేలి ఒక చిన్నారి మృతి చెందగా.. మరో ఇద్దరు పిల్లలు, వారి తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. నగర శివారులోని సారంగపూర్ విజయ డైరీ సమీపంలో ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ప్రమాదంలో ఇంటి సభ్యులకు తీవ్రగాయాలయ్యాయి.
క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. ఐదేళ్ల ఏళ్ల చిన్నారి నన్కి కుమారి మార్గమధ్యలో మృతి చెందింది. మరో ఇద్దరు చిన్నారులు బబ్లూ (8), జగ్గు (2)లకు తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులు విజయ్ యాదవ్, ధన్వంతరి బాయికి సైతం గాయాలు కాగా.. వీరిని హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధితులు బిహార్‌కు చెందిన పాల వ్యాపారులుగా పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి:Bandi Sanjay on Paddy Procurement : 'కేంద్రం కొంటా అంటున్నా.. కేసీఆర్ సహకరించట్లేదు'