విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు మృతి, ముగ్గురు విద్యార్థులు గల్లంతు - STUDENTS MISSING IN KRISHNA RIVER

16:38 December 16
Five students drowned in Krishna river
STUDENTS MISSING IN KRISHNA RIVER : ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలోని యలమంచిలి వద్ద కృష్ణానదిలో ఈతకు దిగి ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఇద్దరు మృతి చెందగా ముగ్గురి కోసం పోలీసులు, సహాయక సిబ్బంది గాలిస్తున్నారు. నదిలో మునిగిపోతున్న మరో ఇద్దరు విద్యార్థులను స్థానికులు రక్షించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. విద్యార్థులు గల్లంతవ్వడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవీ చూడండి: