తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఐబీఎస్​ ర్యాగింగ్​ వ్యవహారం.. ఐదుగురు అరెస్టు మరో ఐదుగురు కోసం గాలింపు - శంకరపల్లి ఐబీఎస్​లో​ ర్యాగింగ్​

Ragging incident in IBS: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శంకరపల్లిలోని ఇండియాన్​ బిజినెష్​ స్కూల్​లో ర్యాగింగ్​కు సంబంధించిన కేసులో పోలీసులు ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. మరో ఐదుగురు విద్యార్థులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే కాలేజీ యాజమాన్యం వీరిని సస్పెండ్​ చేయగా.. వారిపై పోలీసులు ర్యాగింగ్​ నిరోధక చట్టం అనుసరించి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Five students arrested
Five students arrested

By

Published : Nov 13, 2022, 2:06 PM IST

Ragging incident in IBS: హైదరాబాద్​లోని శంకరపల్లి ఇండియాన్​ బిజినెష్​ స్కూల్​లో ర్యాగింగ్​కు సంబంధించిన కేసులు పోలీసులు ఐదుగురుని అరెస్టు చేశారు. మరో ఐదుగురు కోసం గాలిస్తున్నారు. బాధిత విద్యార్ధి ఫిర్యాదు మేరకు కేసు నమోద చేసిన శంకర్​పల్లి పోలీసులు. కళాశాలకు చెందిన కొందరు విద్యార్థులపై సెక్షన్ 307, 323, 450, 342, 506 రెడ్​విత్ 149 ఐపీసీ 4(I), 4 (Ii), 4(Iii) ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు.

ర్యాగింగ్ వ్యవహారంలో యాజమాన్య నిర్లక్ష్యం కింద కళాశాలపై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ర్యాగింగ్​కు పాల్పడిన పదిమంది విద్యార్థులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది.​

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details