తెలంగాణ

telangana

ETV Bharat / crime

రెచ్చిపోయిన దొంగలు.. 5 ఇళ్లల్లో చోరీలు..! - telangana latest news

మేడ్చల్​ జిల్లా సారెగూడెంలో దొంగలు రెచ్చిపోయారు. పక్కపక్కనే ఉన్న ఐదు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. నగలు, నగదుతో ఉడాయించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

5 ఇళ్లల్లో చోరీలు
5 ఇళ్లల్లో చోరీలు

By

Published : May 18, 2021, 1:45 PM IST

5 ఇళ్లల్లో చోరీలు

మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్‌ స్టేషన్‌ పరిధి సారెగూడెం గ్రామంలో వరుస ఇళ్లల్లో దొంగతనాలు కలకలం రేపాయి. ఐదుగురు సభ్యుల ముఠా అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒకేసారి ఐదు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. మూడు ఇళ్లలో నగలు, నగదు దోచుకెళ్లారు.

బాలమణి అనే వృద్ధురాలు నిద్రిస్తుండగా.. ఆమె మెడలోంచి మూడు తులాలకు పైగా బంగారు గొలుసును దొంగిలించారు. పక్కనే మరో వ్యక్తి మహేశ్​ ఇంట్లో రూ.4 వేలు, రెండు ఫోన్లను దుండగులు ఎత్తుకెళ్లారు. మరో వ్యక్తి సురేశ్​ ఇంట్లో రూ.11 వేలతో ఉడాయించారు. సంతోశ్​ అనే వ్యక్తి ఇంట్లో మూడు గదులు వెతికినా ఏమీ దొరకకపోవడంతో ఆ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను గమనించిన దుండగులు వాటిని ధ్వంసం చేసి పారిపోయారు. దొంగతనాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: చామనపల్లిలో ప్రజాప్రతినిధుల ఘర్షణ.. భూవివాదమే కారణం

ABOUT THE AUTHOR

...view details