two persons died: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఓ ఇంట్లోని ముగ్గురు కుటుంబసభ్యులు విద్యుదాఘాతానికి గురి కాగా.. రెండేళ్ల చిన్నారితో పాటు ఇద్దరు మృతి చెందారు. వీరంతా ఒడిశాలోని జాజిపూర్ మండలం జగాత్ సింగ్‌పూర్‌కు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
two persons died: ఇనుపచువ్వను తీయబోయి.. రెండేళ్ల చిన్నారితో సహా తండ్రి మృతి
14:43 December 27
two persons died: ఇనుపచువ్వను తీయబోయి.. రెండేళ్ల చిన్నారితో సహా తండ్రి మృతి
died with electric shock: చనిపోయిన వారిలో బసుదేవమాలిక్ అతని కూతురు రెండేళ్ల చిన్నారి కున్నూ మాలిక్ కూడా ఉంది. ఈ ప్రమాదంలో బసుదేవమాలిక్ భార్య రేను మాలిక్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఇనుపచువ్వ తీసే క్రమంలో ప్రమాదం
ఒడిశా రాష్ట్రానికి చెందిన బసుదేవమాలిక్ కొంతకాలం క్రితం బతుకుదెరువుకోసం ఇస్నాపూర్‌లోని ఓ పరిశ్రమలో పనిచేస్తూ తన కుటుంబంతో కలిసి ప్రముఖ్‌నగర్‌లోని ఓ భవనంలో నివాసముంటున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం కిటికీపై ఉన్న ఇనుపచువ్వను బసుదేవ మాలిక్ తీయబోయాడు. పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలకు అతని చేతిలో ఉన్న ఇనుపచువ్వ తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో బసుదేవమాలిక్, అతని కాళ్లవద్ద ఉన్న రెండేళ్ల చిన్నకూతురు కున్నుమాలిక్ కూడా అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. ఇదే ఘటనలో భార్య రేను మాలిక్ తీవ్రంగా గాయపడటంతో ఆమెను చందానగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: