Tractor Overturned In Bhadradri Kothagudem District: మన ప్రాంతంలో పెళ్లి ఎంత బాగా జరుపుకుంటామో, ఛత్తీస్గఢ్లో దినం కార్యక్రమాన్ని అక్కడి ప్రజలు అంత ఘనంగా జరుపుకుంటారు. దానిలో భాగంగానే తమ బంధువుల వ్యక్తి తెలంగాణలో మరణించడంతో అతని దినం కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణకు రావడానికి ట్రాక్టర్లో 35 మంది గిరిజనులు బయల్దేరారు.
ఛత్తీస్గఢ్ నుంచి పరామర్శకు వస్తుండగా ట్రాక్టర్ బోల్తా.. ఐదుగురికి గాయాలు - Tractor Overturned In Bhadradri Kothagudem
Tractor Overturned In Bhadradri Kothagudem District: ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కొందరు వ్యక్తులు బంధువుల వ్యక్తి దినం కార్యక్రమంలో పాల్గొనేందుకు ట్రాక్టర్లో తెలంగాణకు బయల్దేరారు. వస్తోన్న క్రమంలో ట్రాక్టర్ బోల్తాపడింది. ట్రాక్టర్లో 35 మంది ఉండగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురికి గాయాలు..
వస్తున్న క్రమంలో తెలంగాణ బోర్డర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండలం వద్ద ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు... క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: