తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆర్కే బీచ్‌లో స్నానానికి దిగి హైదరాబాద్​ వాసి మృతి.. మరో ఇద్దరు గల్లంతు - hyderabad young men washed away in rk beach

four people washed away in vishaka rk beach
ఆర్కే బీచ్‌లో స్నానానికి దిగి ఐదుగురు గల్లంతు

By

Published : Jan 2, 2022, 4:52 PM IST

Updated : Jan 2, 2022, 8:12 PM IST

16:49 January 02

విహారయాత్రకు వెళ్లి.. ఆర్కే బీచ్​లో నలుగురు హైదరాబాద్​ వాసులు గల్లంతు

సముద్రంలో స్నానానికి దిగి నలుగురు గల్లంతు

Visakha RK beach: హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్లిన విహారయాత్ర విషాదాంతమైంది. ఆర్కే బీచ్​లో స్నానానికి దిగి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. హైదరాబాద్ బేగంపేటకు చెందిన 8మంది స్నేహితులు ఈనెల 30న కాచిగూడ నుంచి ట్రైన్​లో విశాఖ బయలుదేరి వెళ్లారు. నగరానికి చెందిన శివ అనే యువకుడు... సముద్రంలో ఈతకు వెళ్లి మృతి చెందాడు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వీరంతా రసూల్‌ పురాలోని ఇందిరమ్మ నగర్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 30న సాయంత్రం కాచిగూడ నుంచి రైలులో 8 మంది మిత్రులు విశాఖకు వెళ్లారు. నిన్న సింహాద్రి అప్పన్నను దర్శించుకుని.. ఇవాళ బీచ్​కు విహారానికి వెళ్లారు.

ప్యారడైస్ హెచ్​డీఎఫ్​సీ బ్యాంకులో పనిచేస్తున్న సీహెచ్​ శివ... డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న ముదిరాజ్ శివ, అజీస్ ముగ్గురు అలల ఉద్ధృతిలో కొట్టుకుపోయారు. వీరిలో సీహెచ్​ శివ మృతదేహం లభ్యమైంది. గల్లంతైన ముదిరాజ్ శివ, అజిస్ కోసం గాలింపు చేపట్టారు.

ఎమ్మెల్యే పరామర్శ...

ఇందిరమ్మ కాలనీలో బాధిత కుటుంబ సభ్యులను.. స్థానిక శాసనసభ్యుడు సాయన్న పరామర్శించారు. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. కుటుంబ సభ్యులు విశాఖపట్నం వెళ్లేందుకు వాహనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఘటనతో రసూల్‌ పురాలోని.. కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలకు వెళ్లి... ప్రమాదానికి గురికావడంపై.. స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒడిశా నుంచి వచ్చి...

ఒడిశాలోని భద్రక్‌ జిల్లాకు చెందిన ఐదుగురు విద్యార్థులు.. మధ్యాహ్నం ఆర్‌కే బీచ్‌కు చేరుకున్నారు. ఈ ఐదుగురు స్నానం చేయడానికి సముద్రంలో దిగారు. పెద్ద కెరటం నెట్టడంతో విద్యార్థిని సుమిత్రా త్రిపాఠి నీట మునిగింది. మిగిలిన నలుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. కాసేపటి తర్వాత సుమిత్రా త్రిపాఠి మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది.

గాలింపు చర్యలు

గల్లంతైన ఇద్దరు హైదరాబాద్‌ యువకుల కోసం గజ ఈతగాళ్లు, లైఫ్‌ గార్డ్స్‌ గాలింపు చర్యలు చేపట్టారు. మూడో పట్టణ సీఐ కోరాడ రామారావు నేవీ, మెరైన్‌ సిబ్బందికి సమాచారం అందజేశారు. స్పీడ్‌ బోట్లు, హెలికాప్టర్‌ ద్వారా గాలించే అవకాశం ఉంది. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

ఇదీ చదవండి:Youth Gang War in LB Nagar : హైదరాబాద్​లో గ్యాంగ్ వార్.. యువకుడు మృతి

Last Updated : Jan 2, 2022, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details