లాక్డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై మద్యం, గంజాయి మత్తులో యువకులు దాడికి పాల్పడిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గోదావరి నది పోలీస్ చెక్పోస్ట్ వద్ద చోటు చేసుకుంది. మాస్కులు ఎందుకు పెట్టుకోలేదని, లాక్డౌన్ సమయంలో ఎటు వెళ్తున్నారని ప్రశ్నించిన పోలీసులపై రాళ్లతో దాడి చేశారు.
మద్యం మత్తులో పోలీసులపై యువకుల దాడి - తెలంగాణ వార్తలు
మాస్కులు ఎందుకు పెట్టుకోలేదని, లాక్డౌన్ సమయంలో ఎటు వెళ్తున్నారని ప్రశ్నించిన పోలీసులపై రాళ్లతో దాడి చేశారు ఐదుగురు యువకులు. ఈ దాడిలో ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లులకు గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి నది పోలీస్ చెక్పోస్ట్ వద్ద చోటు చేసుకుంది.
attack on police, godavari checkpost, godavarikhani
రామగుండం సింగరేణి ఓసీపీ-3 ప్రాజెక్టు, సుచి ఇన్ ఫ్రాలో కాంట్రాక్ట్ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురు యువకులు మంచిర్యాల జిల్లా నుంచి గోదావరిఖనికి వస్తుండగా అడ్డుకున్న పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిలో ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లులకు గాయాలయ్యాయి. దాడి చేసిన వారిలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారయ్యారు. వారిపై కేసు నమోదు చేసినట్లు గోదావరిఖని పట్టణ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీ చూడండి: విద్యుదాఘాతంతో ఆవు మృతి