తెలంగాణ

telangana

ETV Bharat / crime

Accidents: అనంతపురం జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు మృతి - accidents in ap

five members died
ఆటోను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం.. ఐదుగురు మృతి

By

Published : Nov 5, 2021, 6:57 AM IST

Updated : Nov 5, 2021, 8:36 AM IST

06:54 November 05

అనంతపురం జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు

అనంతపురం జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. పామిడిలోని 44వ జాతీయ రహదారిపై కూలీలతో వెళ్తున్న ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 8 మంది గాయపడ్డారు. వీరంతా పెద్దవడుగూరు మండలం కొట్టాలపల్లిలో పత్తి కోతకు వెళ్తుండగా దుర్ఘటన చోటుచేసుకుంది. 

ప్రమాదం ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆటో నుజ్జునుజ్జయింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను సుబ్బమ్మ, శంకరమ్మ, నాగవేణి, సావిత్రి, చౌడమ్మగా గుర్తించారు. వీరిది గార్లదిన్నె మండలం కొప్పలగొండ.

పాదచారులను ఢీకొట్టిన కారు

ఇదే జిల్లాలో మరో ప్రమాదం కూడా చోటుచేసుకుంది. పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద జాతీయ రహదారిపై పాదచారులను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మృతులను పామిడి మండలం ఎదురూరు వాసులు యాకుబ్‌ (62), నారాయణ (60)గా గుర్తించారు. 

ఇవీ చూడండి: 

Last Updated : Nov 5, 2021, 8:36 AM IST

ABOUT THE AUTHOR

...view details