భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల పోలీసులు ఐదుగురు మావోయిస్టు మిలిషియా సభ్యులను అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నిమ్మలగూడెం గ్రామానికి చెందిన ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు.
ఐదుగురు మావోయిస్టు మిలిషియా సభ్యులు అరెస్ట్ - చర్ల పోలీసులు
ఐదుగురు మావోయిస్టు మిలిషియా సభ్యులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. కూంబింగ్ కు వెళ్లిన పోలీసుల సమాచారాన్ని మావోయిస్టులకు చేరవేస్తున్న క్రమంలో వారిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Maoist militia members arrest, bhadradri kothagudem, charla police
పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు ఈరోజు ఉదయం తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతానికి కూంబింగ్ కు వెళ్లారు. పోలీస్ చర్యలను కనిపెట్టి.. మావోయిస్టులకు సమాచారం చేరవేస్తున్న క్రమంలో వారిని అరెస్ట్ చేసినట్లు చర్ల పోలీసులు తెలిపారు. ఇతర మావోయిస్టు మిలిషియా సభ్యులతో కలిసి అనేక విధ్వంస కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: గుంజపడుగు ఎస్బీఐ బ్యాంకు చోరీ కేసులో ఒకరు అరెసిట్