తెలంగాణ

telangana

ETV Bharat / crime

Ganja seized: ఏపీ నుంచి గంజాయి తెచ్చి విక్రయం.. 5 కిలోలు స్వాధీనం - ganja seized news

రాష్ట్రంలో గంజాయి వాడకం(Ganja seized), విక్రయం విపరీతంగా పెరిగిపోతోంది. యువత నేరాలు, అఘాయిత్యాలకు పాల్పడటానికి గంజాయి వాడకం ప్రధాన కారణమవుతోంది. దీంతో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. తనిఖీల్లోనే కాకుండా, ఎక్కడ గంజాయి(Ganja seized) విక్రయిస్తున్నారని తెలిసినా అక్కడ పోలీసులు ప్రత్యక్షమై భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా ఏపీ నుంచి రాష్ట్రానికి తీసుకువచ్చి వ్యాపారం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

ganja seized
గంజాయి సీజ్​

By

Published : Oct 31, 2021, 4:31 PM IST

Updated : Oct 31, 2021, 6:12 PM IST

పొరుగు రాష్ట్రం నుంచి గంజాయి(Ganja seized) తీసుకువచ్చి.. స్థానికంగా విక్రయిస్తున్న వ్యక్తిని సంగారెడ్డి జిల్లా పటాన్​ చెరు ఎక్సైజ్​ అధికారులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 5కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అమీన్​పూర్​ మండలం సుల్తాన్​పూర్ శివారు చెరువు కట్టపై గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో పటాన్​చెరు ఎక్సైజ్​ అధికారులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో ఏపీలోని కృష్ణా జిల్లా పెందుర్రుకు చెందిన ఇషాన్.. గంజాయి(Ganja seized) విక్రయిస్తూ అధికారులకు పట్టుబడ్డాడు. అతని వద్ద 1.5 కిలోల గంజాయి లభ్యం కాగా.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు.

ఇషాన్​(Ganja seized).. బాచుపల్లిలో ఒక గది అద్దెకి తీసుకుని ఉంటున్నాడు. ఆంధ్రప్రదేశ్​లోని అరకు నుంచి గంజాయి తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. బాచుపల్లి గదిలో దాచిన మూడున్నర కిలోల గంజాయి(Ganja seized), చరవాణిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్​కు తరలించినట్లు పటాన్​చెరు అబ్కారీ సీఐ సీతారాం రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:Railway Crime News: టికెట్‌ బుక్‌ చేసుకుని మరీ చోరీలు!

Last Updated : Oct 31, 2021, 6:12 PM IST

ABOUT THE AUTHOR

...view details