సాగులో వరసగా నష్టాలు, అప్పుల బాధతో వికారాబాద్, వరంగల్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఐదుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కౌఠ గ్రామానికి చెందిన ఇట్టెడి రమణారెడ్డి(52) తనకున్న 10 ఎకరాల భూమిలో సోయా, కౌలుకు తీసుకున్న 20 ఎకరాల్లో పత్తి, కంది సాగు చేశారు. వీటి సాగుకు రూ.13 లక్షల వరకు అప్పు చేయాల్సి వచ్చింది. రెండేళ్లుగా సరైన దిగుబడులు రావడం లేదు. అప్పులు ఎలా తీర్చాలని ఆందోళనకు గురవుతున్న రమణారెడ్డి.. సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు బోథ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు.
వరుణుడి దెబ్బకు
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లెంకాలపల్లి గ్రామానికి చెందిన కీసరి సాయిలు(59) ఎకరం పొలంలో వరి సాగు చేశారు. భారీ వర్షాలకు పంట కొట్టుకుపోయింది. మూడేళ్లుగా దిగుబడులు సరిగా రాకపోవడంతో పెట్టుబడి కోసం చేసిన అప్పు రూ.లక్ష వరకు పేరుకుపోయింది. వరుస నష్టాల వల్ల అప్పు తీర్చలేనన్న ఆందోళనతో ఆదివారం పురుగుల మందు తాగేశారు. కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు.
పత్తి సాగు ముంచింది