హైదరాబాద్ బేగంపేటలో దీపావళి ధమాక పేరుతో భారీస్థాయిలో పేకాట శిబిరాన్ని నిర్వహించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అరవింద్ అగర్వాల్ ఇంట్లో రూ.12,65,000 స్వాధీనం చేసుకున్నారు. అపార్ట్‌మెంట్‌లోంచి శబ్దాలు వస్తున్నాయంటూ స్థానికులు చేసిన ఫిర్యాదుతో... పోలీసులు దాడి చేశారు.
పేకాట కేసులో ఐదుగురు అరెస్టు.. రూ.12.66 లక్షలు స్వాధీనం - poker case
10:20 November 06
పేకాట కేసులో ప్రజాప్రతినిధి!
పేకాట ఆడుతున్నవారిలో సంపన్నులు, పలుకుబడి కలిగినవారు ఉన్నట్లు సమాచారం. ముగ్గురు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారని... వారిని వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నగరానికి చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి బేగంపేటకు చేరుకుని వ్యవహారాన్ని సరిచేశారని సమాచారం. అయితే పోలీసులు మాత్రం అదంతా తప్పుడు సమాచారమని ఖండించారు.
ఇదీ చూడండి:Naga shourya farmhouse case: సుమన్‌ను కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
Naga shourya farmhouse case: ఫాంహౌస్ పేకాట కేసులో వెలుగులోకి సంచలన విషయాలు