చేపల ధరను తగ్గించాలని అడిగినందుకు.. ఇద్దరిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు విక్రయదారుడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా గుడివాడలో జరిగింది. బంటుమిల్లి రోడ్డులోని శివ చేపల దుకాణంలో.. మహమ్మద్ రబ్బానీ చేపలు కొనుగోలు చేశాడు. కొన్న చేపల్లో అర కిలోకిపైగా జన రావడంతో ధర తగ్గించమని రబ్బానీ అడిగాడు. దీంతో మాటా మాటా పెరిగి.. ఆవేశానికి లోనైన చేపల దుకాణ యజమాని శివ.. రబ్బానీపై దాడి చేశాడు.
ఈ విషయం తెలుసుకున్న రబ్బానీ కుటుంబసభ్యులు రఫీ, రసూల్‌ను ఇదేం పద్ధతని శివను ప్రశ్నించారు. దీంతో పట్టరాని ఆగ్రహంతో శివ తన కుమారుడితో కలిసి రఫీ, రసూల్‌పై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో రసూల్ గొంతుపై తీవ్ర గాయాలు కాగా.. రఫీ చేతులు తెగిపోయాయి. బాధితులను గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం విజయవాడ తరలించారు. కేసు నమోదు చేసిన గుడివాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.