కరీంనగర్ మత్స్యశాఖ డిప్యూటీ డైరక్టర్ ఖదీర్ అహ్మద్, సీనియర్ అసిస్టెంట్ అంజయ్య వేర్వేరుగా లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లిలో మహిళా మత్స్యకారుల సొసైటీ ఏర్పాటు కోసం ఖదీర్ అహ్మద్ రూ.40 వేలు లంచంగా తీసుకోగా... సిరిసిల్లలో సీనియర్ అసిస్టెంట్ అంజయ్య రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.
అ.ని.శా వలలో కరీంనగర్ మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ - కరీంనగర్ మత్స్యశాఖ డిప్యూటీ డైరక్టర్
మత్స్యశాఖలో పనిచేస్తున్న డిప్యూటీ డైరెక్టర్, సీనియర్ అసిస్టెంట్లు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన కరీంనగర్, సిరిసిల్లలో చోటు చేసుకుంది.
అ.ని.శా వలలో కరీంనగర్ మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్
బాధితుల ఫిర్యాదుతో అప్రమత్తమైన అవినీతి నిరోధక శాఖ అధికారులు... కరీంనగర్, సిరిసిల్లలో ఏకకాలంలో వీరిని పట్టుకున్నామని వరంగల్ ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ రావు తెలిపారు.