తెలంగాణ

telangana

ETV Bharat / crime

బిహార్‌లో తెలంగాణ పోలీసులపై కాల్పులు - telangana police

firing on telangana police in bihar
బిహార్‌లో తెలంగాణ పోలీసులపై కాల్పులు

By

Published : Aug 14, 2022, 9:55 PM IST

21:50 August 14

firing on telangana police in bihar

బిహార్‌లో తెలంగాణ పోలీసులపై సైబర్‌ నేరగాళ్లు కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. వాహన కంపెనీల ప్రాంఛైజీల పేరిట సైబర్‌ మోసాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న నిందితులను పట్టుకునేందుకు తెలంగాణ పోలీసులు బిహార్‌ వెళ్లారు. నవాడా జిల్లాలోని భవానిబిగా గ్రామంలో నిందితుల ఆచూకీ గుర్తించారు.

స్థానిక పోలీసుల సాయంతో నిందితులను పట్టుకునే క్రమంలో ప్రధాన నిందితుడు మితిలేష్ ప్రసాద్‌ పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకున్నాడు. మిగిలిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.1.22 కోట్ల నగదు, 3 కార్లు, 5 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, కాల్పుల ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై నగరానికి తీసుకురానున్నట్టు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details